కావలి వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బోగోలు మండల వైసీపీ కన్వీనర్ మద్దినబోయిన వీర రఘు సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు రాజకీయాలకు ఆద్యం పోయడం తెలుగుదేశం పార్టీకి మొదటినుంచి అలవాటే అన్నారు. కావలిలో తెలుగుదేశం నాయకులు ఒక మీడియా బ్రోకర్ని అడ్డం పెట్టుకొని మా మాజీ ఎమ్మెల్యే పై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.