నెల్లూరులో జరుగు రైతు సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా కావలి నుంచి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్, మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరుకు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. కావలి లోని రామిరెడ్డి నివాసం నుంచి భారీగా కార్లలో వైసీపీ శ్రేణులు నెల్లూరుకి ప్రారంభమై వెళ్లారు. జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.