కోవూరు మండలంలోని పడుగు పాడు నేతాజీ నగర్ స్టవ్ బీడీ కాలనీలో పెరిగిపోయిన మొక్కలను శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు జెసిబితో తొలగించారు. డ్రైనేజీ కాలువకు ఇరువైపులా మొక్కలు బాగా పెరిగిపోయి, పారుదల లేదని పూడిక తీత పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.