కావలి డిఎస్పి శ్రీధర్ ని మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు సోమవారం వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శాలువాతో డిఎస్పీని సత్కరించి, పుష్పగుచ్చాన్ని అందించారు. అనంతరం దగదర్తి మండలంలోని పలు సమస్యలను డిఎస్పీకి మాలేపాటి వివరించారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. దగదర్తి మండలం పరిధిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.