నెల్లూరు జిల్లా దగదర్తి మండల గృహ నిర్మాణ సంస్థ ఏఈ కార్యాలయానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు సోమవారం ప్రజలతో కలిసి వెళ్లారు. అక్కడ అధికారంతో లబ్ధిదారుల సమస్యల గురించి విన్నవించారు. ఈ సందర్భంగా అర్హులైన వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. నూతనంగా నిర్మించే గృహాలను నాణ్యతతో పనులు జరపాలన్నారు. అలాగే ఇల్లు లేని వారికి నూతన ఇల్లు మంజూరు చేయాలని కోరారు.