కొండ బిట్రగుంట ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

61చూసినవారు
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 9వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ కార్య నిర్వాహకులు, పోలీసులకు భద్రత ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్