ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కావలి పట్టణంలో శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం శుక్రవారం జరిగింది. 27వ వార్డులో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. వంద రోజులలో కూటమి ప్రభుత్వం అందజేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.