నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం బోగోలు మండలంలోని జవ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, తదితరులు పాల్గొన్నారు.