నెల్లూరు: కిడ్నాపర్ నుంచి చిన్నారులు సేఫ్

76చూసినవారు
నెల్లూరు: కిడ్నాపర్ నుంచి చిన్నారులు సేఫ్
నెల్లూరు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శెట్టిగుంట రోడ్డులో ఆటో కోసం ఎదురుచూస్తున్న శెట్టిగుంట కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కృష్ణ, శీనమ్మ దంపతుల ఇద్దరు పిల్లలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి, కావలి మండలం చలమచర్లకు చెందిన జాలమ్మ చిన్నారులను తీసుకెళ్లినట్లు గుర్తించి, వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్