నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఏ. వీ. ఎస్ కళ్యాణ మండపంలో కావలి స్వర్ణకారుల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు.