కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి యానాది శెట్టి ప్రథమ వర్ధంతి సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాశనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ కావలి అభివృద్ది కోసం ప్రతీక్షణం పరితపించి, తన జీవితాంతం వరకు ప్రజా సేవలోనే గడిచిన మహోన్నత వ్యక్తి గ్రంధి యానాది శెట్టి అని ఆయన కావలి అభివృద్ది కోసం చేసిన కృషిని కావలి ప్రజలు మర్చిపోలేరని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.