నెల్లూరు జిల్లా అల్లూరు మండలం లోని నార్త్ మోపూరు, నార్త్ ఆములూరు, గ్రద్దగుంట, బీరంగుంట, బట్రకాగుళ్లు, అల్లూరు పట్టణం ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు, చెట్ల కొమ్మలు తొలగింపు శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏఈ షరీఫ్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.