అల్లూరులో ఈరోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం

72చూసినవారు
అల్లూరులో ఈరోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం లోని ఇసుకపల్లి సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. 33/11 కె. వి ఇసుకపల్లి సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు, విద్యుత్ లైన్ లకు అంటుకున్న చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ గాయత్రి తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్