నూతన కావలి 1టౌన్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుమన్ ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం సాయంత్రం పోలీసు సిబ్బందితో కలిసి ఆయన కావలి పట్టణంలో వాహనదారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.