దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలోని శనైశ్చర స్వామికి శనివారం శని త్రయోదశి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తైలాభిషేకం ప్రత్యేక హోమం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.