కావలి నియోజకవర్గంలో 26వ తేదీ వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 21వ తేదీ దగదర్తి మండలం చెన్నూరు, 22న కావలి పట్టణం 38వ వార్డు, 23వ తేదీ బోగోలు మండలం బోగోలు మెయిన్, 24న కావలి పట్టణం 13వ వార్డు, 25 కావలి రూరల్ చెన్నాయిపాలెం, 26న అల్లూరు మండలం ఇసుకపల్లి లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.