నేను వెన్నుపోటు పొడిచి పైకి వచ్చిన వాడిని కాదు. నా తరహాలో వ్యాపారం చేసుకుని పైకి వచ్చిన వాడిని అని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కావలి నియోజకవర్గంలో ఎవరు ఏం చేశారో అందరికీ తెలుసు, ఎవరు ఎవరిని బెదిరించారో తెలుసు, నాకు తెలియకుండా అక్రమ లే అవుట్లు వేసి అక్రమంగా దోచుకుని నాకు చెడ్డ పేరు తెచ్చారని మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.