కావలి రూరల్ మండలం జువిగుంటపాలెంలో శనివారం రాత్రి మూడు గడ్డి వాములు అగ్నికి ఆహుతి అయ్యాయి. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం గ్రామానికి వెళ్లి అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను అడిగి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. పశువుల మేత అగ్నికి ఆహుతి కావడం బాధాకరమన్నారు. గడ్డివాముల యజమానులకు ఆర్థిక సహాయం అందజేశారు.