బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు 90 రోజులు టైలరింగ్ శిక్షణ అందిస్తున్న ఉదయగిరి కేంద్రాన్ని బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి మంగళవారం సందర్శించారు. టైలరింగ్ శిక్షణలో మహిళలు నేర్చుకున్న మెలకువలు, పనితీరుపై ఆరా తీశారు. శిక్షణ కేంద్రంలో కుట్టిన బట్టలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అప్పాజీ, కేంద్ర నిర్వాహకులు నాజీయ తాజున్ పాల్గొన్నారు.