ఉదయగిరి పట్టణంలోని శ్రీ శక్తి భవనంలో ఉపాధి హామీ సిబ్బందితో డ్వామా పీడీ గంగ భవాని మంగళవారం సమావేశం అయ్యారు. ఉదయగిరి మండలంలోని 17 పంచాయతీలలోని ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరికి పని కల్పించాలని పనికి తగ్గ వేతన మన్నించాలని తెలిపారు. ఎవరైనా పనికిరాకుండా వారికి మస్టర్లు వేస్తే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.