కావలి: ఎన్నో రోజుల తర్వాత ఆ వీధిలో లైట్

4చూసినవారు
కావలి: ఎన్నో రోజుల తర్వాత ఆ వీధిలో లైట్
కావలి పట్టణంలోని శాంతినగర్ చాట్లవారివీధిలో చాలా రోజులకు విద్యుత్ దీపానికి మోక్షం లభించింది. చాట్లవారివీధిలో ఉన్న ఓ స్తంభం ఈదురుగాలులకు కూలి పడిపోయింది. దీంతో ప్రజలు విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగితే స్తంభం ఏర్పాటు చేశారు. ఈ స్తంభానికి విద్యుత్ దీపం బిగించాలని సంబంధిత మున్సిపల్ సిబ్బంది చుట్టూ నెల రోజులకు పైగా ప్రజలు తిరిగినా ఏవో సాకులు చెప్పి పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఆదివారం లైట్ బిగించారు.

సంబంధిత పోస్ట్