కావలి కాలువకు రెండో పంటకు నీరు విడుదల

72చూసినవారు
కావలి కాలువ లోని ఉపకాలువ ఎస్ వి పి ఎం మేజర్ డిస్ట్రిబ్యూటరీ కాలువకు రెండవ పంటకు నీరు విడుదలను కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మాజీ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు, నీటి సంఘం అధ్యక్షులు చేతుల మీదుగా శనివారం నీరు విడుదల చేశారు. కావలి కాలువ 30 కిలోమీటర్ల వద్ద ఎస్ వి పి ఎం కాలువకు 108 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. రెండవ పంటకు నీరు ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్