దగదర్తి మండలం చెన్నూరు గ్రామంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శనివారం పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కావలిలో ఉన్న పలు రకాల సమస్యలు తీర్చినట్లు తెలిపారు. ప్రధానంగా రోడ్డు మార్గాలపై దృష్టి సారించి, ముసునూరు, తుమ్మలపెంట, దగదర్తి-బుచ్చి రోడ్డుల పనులు ప్రారంభించామన్నారు.