దగదర్తి మండలం తురిమెర్ల గ్రామ పంచాయతీలో రూ. 15 లక్షలతో ఏర్పాటు చేసిన పంచాయతీ భవనాన్ని అధికారులు, పార్టీ నాయకులతో కలిసి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యువనేత నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రం రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి చెందుతుందన్నారు.