రాష్ట్రం ఆర్థికంగా వెనుక పడడానికి వైసీపీ కారణం

64చూసినవారు
రాష్ట్రం ఆర్థికంగా వెనుక పడడానికి వైసీపీ కారణం
కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి శనివారం దగదర్తి మేజర్ పంచాయతీ, చెన్నూరులో పర్యటించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎన్నో ఏళ్ళు వెనక్కి వెళ్లిందని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చంద్రబాబు నాయుడుకి ఒక సవాలుగా మారిందన్నారు. ఆర్థికంగా రాష్ట్రం వెనుక పడడానికి వైసీపీ కారణమన్నారు.

సంబంధిత పోస్ట్