కొడవలూరు మండలంలోని ఎల్లయ్యపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా వివేకానంద రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. గురువారం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆత్మీయులు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మోహన రామలింగయ్య, ఉపాధ్యాయులు, ఆత్మీయులు, తదితరులు పాల్గొన్నారు.