నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని ఇఫ్కో కిసాన్ సెర్చ్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కార్గో కంటైనర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ లో ఉన్న వ్యక్తి మృతి చెందాడు. డ్రైవర్ లక్ష్మణరావు కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి విజయవాడకు చెందిన కొండేటి రవిగా గుర్తించారు.