నెల్లూరు జిల్లా కోవూరు అగ్రికల్చర్ ఏడిఏగా డాక్టర్ అనిత నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉన్నత స్థాయి అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈమె ప్రస్తుతం సూళ్లూరుపేట ఏడిఏగా విధులు నిర్వహిస్తున్నారు. బదిలీపై కోవూరుకు రానున్నారు. ఈమెకు గతంలోనూ కోవూరు మండల అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం కోవూరులో పనిచేస్తున్న ఏడిఏ సుజాతను అగ్రికల్చర్ జిల్లా కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు.