నెల్లూరు జిల్లా బుచ్చి మండలం రేబాల గ్రామంలో గురువారం రైతుల అవగాహన సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. మాజీ జడ్పీటీసీ వేటూరి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఆయనకు ముందే తెలుసు అన్నారు.