తెలుగుదేశం పార్టీ అనేక ప్రలోభాలు పెట్టిన చివరకు నైతిక విజయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుచ్చి నగర పాలక వైస్ చైర్మన్ ల ఎన్నికలపై బుచ్చిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, కోవూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.