బుచ్చిరెడ్డిపాలెం: ఊరిలోకి వచ్చిన జింక

76చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం:  ఊరిలోకి వచ్చిన జింక
అడవుల్లో ఉండాల్సిన మూగజీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎక్కడినుండో తప్పించుకొని వచ్చిన జింక బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మంగళవారం ప్రత్యక్షమైంది. జనావాసాలను చూసి కంగారుపడిన జింక ఓ సినిమా హాల్లోని బాత్రూంలోకి దూరింది. దీనిని గమనించిన సినిమా హాలు నిర్వాహకులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు వచ్చి జింకను పట్టుకుని తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్