బుచ్చిరెడ్డిపాలెం: ఆటోనగర్ కు భూమి పూజ

81చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నాగమాంబాపురం పంచాయతీ విలియమ్స్ పేటలో ఆటో నగర్ కు భూమిపూజ నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హయంలో అభివృద్ధితోపాటు సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. ఆటోనగర్ కార్మికులకు అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. చైర్ పర్సన్ సుప్రజా మురళి, కౌన్సిలర్లు లక్ష్మీకాంతమ్మ, తాళ్ల వైష్ణవి, రహమత్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్