బుచ్చిరెడ్డిపాలెం: రథంలో విహరించిన సీతారాములు

56చూసినవారు
బుచ్చి పట్టణలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సీతారాముల రథోత్సవం రమణీయంగా సాగింది. రథం లాగేందుకు రామభక్తులు పోటీపడ్డారు. యువత ఉత్సాహంతో శ్రీరామ నామస్మరణలతో రథాన్నిలాగారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం జనసంద్రంగా మారింది.

సంబంధిత పోస్ట్