బుచ్చిరెడ్డిపాళెం: నీటి ఇబ్బందిని పరిష్కరించిన టీడీపీ నాయకులు

65చూసినవారు
బుచ్చిరెడ్డిపాళెం: నీటి ఇబ్బందిని పరిష్కరించిన టీడీపీ నాయకులు
బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని 7వ వార్డు ఖాజా నగర్ లో నీటి మోటర్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. దీంతో గత మూడు రోజుల నుంచి స్థానిక ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను స్థానిక టీడీపీ నాయకుడు సుభాని, చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, వైస్ చైర్మన్ నస్రిన్ నగర కమిషనర్ బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు మోటార్కు మరమ్మతులు చేసి నీటి సరఫరాను అందించారు. స్థానిక ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్