బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రోడ్డు ఇరువైపులా నగర పంచాయతీ అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని బుచ్చి కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ, అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జరిమాన విధిస్తామని హెచ్చరించారు. బుచ్చి పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.