కుడితిపాలెంలో చిన్నారుల ర్యాలీ కార్యక్రమం

67చూసినవారు
కుడితిపాలెంలో చిన్నారుల ర్యాలీ కార్యక్రమం
ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం గ్రామంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గ్రామంలో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులందరూ జాతీయ జెండాలను చేతులతో పట్టుకొని భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్