నెల్లూరు నగరంలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. బుచ్చి స్టేషన్ ఇన్స్పెక్టర్ హైమారావు ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదగా ప్రశంస పత్రాన్ని అందజేశారు. పలువురు ఉద్యోగులు, సన్నిహితులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.