పెయ్యలపాలెంలో కోటి రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం

74చూసినవారు
పెయ్యలపాలెంలో కోటి రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె పండుగ కార్యక్రమం జరుపుకొంటున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుధవారం కొడవలూరు మండలం పెయ్యలపాలెంలో 1 కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బిటి రోడ్డు, 5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్