ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలోని శ్రీ జనార్ధన స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని పూలు, పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరించి, నైవేద్యం, దీపారాధన వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి దివ్య దర్శనానికి గ్రామస్థులు, ప్రవాస భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.