ఇందుకూరుపేట మండలంలో సోమవారం నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సాయి లహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 22న డేవిస్ పేట, ఇందుకూరుపేట, జంగం వారి దొరువు, కొత్తూరు చింతోపు గ్రామ సచివాలయం కార్యాలయాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 25వ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ హాజరుకావాలని కోరారు.