బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ప్రార్థన మందిరంలో మట్టలాదివారం వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఈ మేరకు స్థానిక సంఘ కాపరి పాస్టర్ జయరావు ఆధ్వర్యంలో సంఘస్తులు మట్టలు పట్టుకొని పురవీధులలో హోసన్న పాటలు పాడుతూ తిరిగారు. అనంతరం పాస్టర్ జయరావు మట్టలదివారం సందేశాన్ని అందించారు. బంధకం నుండి విడిపించేందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చారని ఆయన తెలిపారు.