నెల్లూరు నగరంలోని పరేడ్ గ్రౌండ్ లో గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు అధికారులకు పురస్కారాలు అందజేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా పేదరిక నిర్మూలన సంస్థ ఉత్తమ సేవలు అందించిన సీఎంఎం హర్షితకు అవార్డు వరించింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేతులు మీదుగా అవార్డును ఆమె అందుకున్నారు.