నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలు, మండలాల్లో భారీ వర్షం

54చూసినవారు
నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలు, మండలాల్లో భారీ వర్షం
నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలంలో గల అన్నారెడ్డిపాలెం, రామతీర్థం, పెద్దపాలెం తో పాటు మరికొన్ని గ్రామాలు, అల్లూరు, సంఘం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో బుధవారం ఉదయం సమయంలో భారీ వర్షం కురిసింది. ఈ విధంగా భారీ వర్షం కురవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిరు వ్యాపారస్తులు, ప్రయాణికులు, ఉద్యోగస్తులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పైన వడ్లు ఆరబోసిన రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.

సంబంధిత పోస్ట్