ఇందుకూరుపేట మండలం పల్లిపాడు లోని పినాకిని గాంధీ ఆశ్రమంలో ఆదివారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి, ఆశ్రమ స్థలదాత పోనక కనకమ్మ విగ్రహానికి పట్టు వస్త్రం, నూలు మాల సమర్పించారు. అనంతరం ఆశ్రమంలోని విద్యార్థులకు వారి గొప్పతనం గురించి వివరించారు. ఈ సందర్భంగా పిల్లలకు తినుబండారాలు పంచిపెట్టారు.