ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గ్రామంలో బిజెపి పల్లెకు పోదాం. గావ్ చలో అభయాన్ కార్యక్రమాన్ని బిజెపి పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వూరు శ్రీనివాసులు శనివారం ప్రారంభించారు. బిజెపి నాయకులు ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి చేస్తున్న అనేక రకాల సంక్షేమం, అభివృద్ధి పనుల గురించి వివరించారు. అలాగే కొన్ని వీధుల్లో మురికి కాలువలను శుభ్రం చేయించి బ్లీచింగ్ కూడా చేయించారు.