జొన్నవాడ: బ్రహ్మోత్సవాలు విజయవంతానికి కృషి చేద్దాం

61చూసినవారు
జొన్నవాడ: బ్రహ్మోత్సవాలు విజయవంతానికి కృషి చేద్దాం
నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో ఈ నెల 17 వ తేది నుంచి 27 వ తేది వరకు జరిగే అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆర్డీవో అనూష సూచించారు. జొన్నవాడ దేవస్థానంలో గురువారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్