కొడవలూరు మండలంలోని కొత్త వంగల్లు, మిక్కిలింపేట గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సిబ్బంది వరి పొలాలను పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు చేశారు. పాము పొడ తెగులు ఆశించి ఉందని నివారణకు హెక్స కొనజోల్ రెండు మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని తెలిపారు. వరి సాగులో అధిక దిగుబడి సాధించేందుకు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు.