కొడవలూరు మండలం గండవరంలో శనివారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి సంవత్సరం రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఆలం మాలకొండయ్య, ఇరిగేషన్ ప్రెసిడెంట్ కంచి ఈశ్వర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ బ్రహ్మానంద రెడ్డి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.