కొడవలూరు రైల్వేస్టేషన్ పరిధిలో మారుపూడి విష్ణు వర్ధన్ అనే వ్యక్తి సోమవారం రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు దగదర్తి గ్రామానికి చెందిన విష్ణు వర్ధన్ గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.