తన సొంత నిధులతో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆలయాల మరమ్మతులు చేపట్టారు. కొడవలూరు మండలం మూలకట్ల సంఘంలో శ్రీ పోలేరమ్మ గుడి, దర్గా సంఘం రాములవారి గుడి మరమ్మతులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తమ సొంత నిధులను సమకూర్చారు. ఆ నిధులతో గ్రామ ప్రజలు ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ఏ నాయకులు వచ్చినా తమను దోచుకున్నారే తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రశాంతమ్మ వచ్చాక మంచి జరుగుతుందన్నారు.